మహానాడులో మాట్లాడుతున్న వారు జగన్ కాలి గోటికి కూడా సరిపోరు: రోజా

  • మహానాడులో టీడీపీ నేతల భాష అసహ్యంగా ఉందన్న రోజా
  • ఇది సైకిల్ పార్టీ మహానాడా? లేక సైకో పార్టీ మహానాడా? అంటూ ఫైర్
  • జగన్ అంటే టీడీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోందని వ్యాఖ్య
  • చెల్లికి ఆస్తిలో జగన్ ఇచ్చినంత వాటా ఎవరూ ఇచ్చి ఉండరన్న రోజా
మహానాడులో టీడీపీ నేతలు వాడుతున్న భాష, వారి బాడీ లాంగ్వేజ్ అసహ్యంగా ఉన్నాయని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. తమ అధినేత జగన్ కాలి గోటికి సరిపోని వారు కూడా ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సైకిల్ పార్టీ మహానాడా? లేక సైకో పార్టీ మహానాడా? అని ప్రశ్నించారు. మహానాడు ఫ్లాప్ అయిందని... టీడీపీ కార్యకర్తలు కూడా మహానాడును పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు.  

చంద్రబాబుది మహానాడు కాదు.. దగానాడు అనేది ప్రజలకు అర్థమయిందని రోజా వ్యాఖ్యానించారు. మహానాడులో టీడీపీ నేతలంతా ఎక్కువగా జగన్ నామస్మరణే చేస్తున్నారని అన్నారు. జగన్ అంటేనే టీడీపీ నేతల వెన్నులో వణుకు పడుతోందని చెప్పారు. జగన్ దెబ్బకు ఢిల్లీలో అమిత్ షా కాళ్లను లోకేశ్ పట్టుకున్నారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారి పోయాయని విమర్శించారు. విపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. 

సైకో పాలనతో జనాలను వేధిస్తున్నది మీరు కాదా చంద్రబాబు అని రోజా ప్రశ్నించారు. ఇద్దరు, ముగ్గురు పిల్లలను కనాలని మహిళలకు చెప్పడానికి చంద్రబాబు ఎవరు అని అన్నారు. నందమూరి హరికృష్ణ శవం దగ్గర కేటీఆర్ తో పొత్తుల గురించి మాట్లాడింది మీరు కాదా? అని ప్రశ్నించారు. లోకేశ్ ఎమ్మెల్యేగా తొలిసారి పోటీ చేసినప్పుడు ఓడిపోయారని... ఓటమి ఎరుగని నేత జగన్ అని అన్నారు. 

తన చెల్లెలికి జగన్ ఇచ్చినంత ఆస్తి ప్రపంచంలో ఎవరూ ఇచ్చి ఉండరని రోజా అన్నారు. హెరిటేజ్ ఆస్తుల్లో తల్లికి, చెల్లికి చంద్రబాబు ఎంత వాటా ఇచ్చారో చెబుతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే వైఎస్ వివేకా హత్య జరిగిందని చెప్పారు. వివేకా హత్య గురించి షర్మిల, సునీత అప్పుడు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.

Roja
YS Jagan
Chandrababu Naidu
Nara Lokesh
TDP Mahanadu
Amit Shah
YSRCP
Andhra Pradesh Politics
YS Viveka Murder Case
Sharmila

More Telugu News